Tuesday, September 10, 2024

ఎంఎల్‌ఎల అనర్హతపై తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్త య్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, పార్టీ మారిన ఖై రతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి, భద్రాచలం ఎంఎల్‌ఎ తెల్ల వెంకట్రావులు రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారారంటూ బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు తన వాదనలు వినిపించారు.

అదేవిధంగా మూడు నెలల్లోపు ఎంఎల్‌ఎల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ రాష్ట్రాల్లోని కోర్టులు వెలువరించిన తీర్పులను ధర్మాసానికి విన్నవించారు. స్పీకర్‌కు మణిపూర్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కాపీని సైతం న్యాయస్థానానికి అందజేశారు. న్యాయస్థానాలు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడం వీలు కాదని ఎంఎల్‌ఎల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రజల చేత ఎన్నికైన నాయకుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేస్తున్నామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News