Tuesday, September 10, 2024

గరీబు నవాజ్… బంగ్లా దిల్‌దార్

- Advertisement -
- Advertisement -

ఢాకా : బంగ్లాదేశ్‌కు నూతన ప్రధాని గా నేడు (గురువారం) బాధ్యతలు స్వీకరించే మహమ్మద్ యూనస్ దే శంలో పేదల పాలిటి పెన్నిధిగా నిలిచారు. సూక్ష్మ స్థాయి గ్రామీణ బ్యాం కింగ్ వ్యవస్థ ద్వారా నిరుపేదలైన బంగ్లాదేశీయులకు కొత్త జీవితాలను అందించా రు. ఈ క్రమంలో ఆయన నోబెల్ పురస్కారం అందుకున్నారు. బడుగులకు బ్యాంకర్ అ యి నిలిచారు. నిరాడంబర జీవితం, ము క్కుసూటితనం యూనస్ దైనందిన జీవన శై లి. ప్రధానిగా షేక్ హసీనా హయాంలో యూ నస్ పలు రకాలుగా వేధింపులకు గురయ్యా రు. ఆర్థిక నేరాలు, పన్నుల ఎగవేతల అభియోగాలతో హసీనా ప్రభుత్వం ఆయనను వేటాడిం ది. ఇప్పుడు హసీనా రాజీనామా తరువాత అందరికి ఆమోదయోగ్య నేతగా బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ సారిథిగా, ప్రధాన మంత్రి బాధ్యతలను 84 సంవత్సరాల ఈ ఆర్థికవేత్త స్వీకరించనున్నా రు. దేశంలోని విద్యార్థి సమూహం డిమాండ్ మే రకు దేశాధ్యక్షులు మెహమ్మద్ షాబుద్దిన్ పార్లమెంట్ రద్దు తరువాతి పరిణామంలో తాత్కాలిక ప్రధాని బాధ్యతలకు యూనస్‌ను నియమించా రు. దీనితో ఇప్పుడు అత్యంత ప్రతిభావంతుడని పేరుతెచ్చుకున్న ఆర్థికవేత్త సారథ్యానికి దేశం చే రుకొంటోంది. ఇకపై జరిగే ఎన్నికలు కూడా ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ సారధ్యంలోనే సాగుతాయి.

మైక్రోఫైనాన్స్ పితామహుడు …
ఇప్పుడు దేశంలో నిష్పక్షపాత ప్రభుత్వానికి సారధ్యం వహించే యూనస్ పేదవర్గాలకు రుణాలు కల్పించడం ద్వారా వారి అభ్యున్నతిని ఆశించే నినాదానికి దిగి ఈ క్రమంలో ప్రపంచ స్థాయిలో మైక్రోఫైనాన్స్ వ్యవస్థ పరిచయం అయింది. ప్రధానిగా ఆయన నియమితులు అయిన దశలో పారిస్‌లో ఉన్న యూనస్ ఇప్పుడు గురువారం బంగ్లాదేశ్‌కు చేరుకుంటారు. బాధ్యతలు స్వీకరిస్తారు. దీనితో బంగ్లాదేశ్‌లో కీలక పరిణామానికి నాంది పలికినట్లు అవుతుంది. జాతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాయాలలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా వ్యవహరించిన విశేష అనుభవం యూనస్‌కు ఉంది. పేదరిక నిర్మూలన ద్వారా మహిళా సాధికారికత దిశలో పాటుపడిన ఆయన సేవలకు గుర్తింపుగా 2006లో ఆయనను నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. తరువాతి క్రమంలో అనేక సార్లు ఆయనకు దేశీయ , అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. బయట విశేష ఖ్యాతి గడించి తరువాత బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన యూనస్‌కు హసీనా ప్రభుత్వం తనదైన రీతిలో చుక్కలు చూపింది. ఆయన కార్యకలాపాలు, మైక్రోఫైనాన్సింగ్ వ్యవహారాలపై అసంబద్ధ కారణాలతో నిఘా పెట్టారు. 2008లో హసీనా అధికారం చేపట్టిన తరువాత ఆయనపై పలు రకాలుగా దర్యాప్తులు జరిగాయి.

చట్టబద్ధమైన గ్రామీణబ్యాంక్ స్థాపనతో సంచలనం
యూనస్ స్థాపించిన చట్టబద్ధమైన గ్రామీణ బ్యాంక్‌ల పనితీరుల్లో లొసుగులు ఉన్నాయని పేర్కొంటూ హసీనా సర్కారు 2011లో కొరడా ఝుళిపించింది. ఈ బ్యాంకు వ్యవస్థాపక సంచాలకులు అయిన యూనస్‌పై పలు అభియోగాలు మోపింది. దేశంలోని రిటైర్మెంట్ నిబంధనలను అతిక్రమించాడనే కేసు నమోదు చేశారు. 2007లో యూనస్ తాను సొంత రాజకీయ పార్టీ పెడుతానని ప్రకటించడం హసీనాకు కోపం తెప్పించింది. అప్పట్లో దేశంలో సైనిక ప్రభుత్వం ఉంది, హసీనా జైలులో ఉన్నారు.

నేతల ధనార్జనపై యూనస్ మండిపాటు
యూనస్ పలు కారణాలతో రాజకీయ పార్టీ పెట్టలేదు. అయితే బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు కేవలం సొంత ధనార్జనపైనే మక్కువ చూపుతారని , వారికి అట్టడుగు స్థాయి పేదల బాగోగుల గురించి ఆలోచన లేదని యూనస్ వ్యాఖ్యానించడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో ఆయనపై వరుసగా అనేక కేసులు నమోదు అయ్యాయి. జనవరిలో ఆయనకు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన , మరో 13 మంది బెయిల్‌పై ఉన్నారు. అక్రమ సంపాదన అభియోగాలతో యూనస్‌పై నేర విచారణ జరిగింది. యూనస్ ఆయన బృందం ఏకంగా అక్రమ లావాదేవీలు, సూక్ష్మ రుణాల పేరిట ఏకంగా 250 మిలియన్ల టాకాలు ( 2 మిలియన్ డాలర్ల ) మేర సంపాదించారని తీవ్ర అభియోగాలు వెలువడ్డాయి.

గ్రామీణ టెలికం సంబంధిత వర్కర్స్ మోసాలు జరిగాయని, దీనికి యూనస్ బాధ్యుడని ఆరోపణలు , తద్వారా ఆయనపై విచారణ జరిగింది. యూనస్ జైలు పాలయ్యారు. అయితే ఆయన పట్ల బంగ్లాదేశ్ వ్యాప్తంగా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అభిమానం నెలకొని ఉంది. ఇప్పటి పరిణామాల క్రమంలో దేశ తాత్కాలిక బాధ్యతలు తీసుకుంటున్న యూనస్ హసీనా దేశం విడిచిపారిపోయిన ఘట్టం గురించి పారిస్‌లో స్పందించారు. ఓ ఇండియన్ పోర్టల్‌తో మాట్లాడారు. ఆమె తన తండ్రి బంగబంధు ముజిబుర్ రెహ్మన్ ఘన వారసత్వాన్ని దెబ్బతీశారు. అప్పట్లో ముజిబుర్ వల్ల దేశం విముక్తం అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ స్వేచ్ఛాయుత దేశం అయిందని యూనస్ వ్యాఖ్యానించారు.

యూనస్ పూర్వాపరాలు
1940లో అవిభక్త భారతదేశంలో చిట్టగాంగ్‌లో యూనస్ జన్మించారు. అప్పట్లో తూర్పు పాకిస్థాన్ గా చలామణిలో ఉన్న బంగ్లాదేశ్‌లో ఢాకా యూనివర్శిటీలో చదివారు. తరువాత స్కాలర్‌షిప్‌తో అమెరికాలోని వండెర్‌బిల్ట్‌లో ఎకనామీలో పట్టా తీసుకున్నారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందారు. తరువాత అమెరికాలోనే ప్రొఫెసర్‌గా ఉన్నారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తరువాత చిట్టగాంగ్ యూనివర్శిటీలో ఆర్థిక విభాగం హెడ్‌గా వ్యవహరించారు. 1991లో ఆయన ఆత్మకథ బ్యాంకర్ టు ది పూర్‌గా వెలువడింది. పలు భాషలలోకి అనువదితం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News