Friday, March 1, 2024

ఎపిలో భారీ వర్షాలు.. చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

మిగ్జాం తుఫాన్ ముంచుకొస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఎపిలోభారీ వర్షాలు కురుస్తాయన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ రోజు మధ్యాహ్నానికి మిగ్జాం తుఫాన్..నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాంధ్ర, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడా వర్షం కురుస్తుండడంతో చెట్లు విరిగి రోడ్లపై పడుతున్నాయి. వైఎస్సార్ జిల్లాలోని బెటాలియన్ వద్ద ఈ రోజు ఉదయం తన విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా సత్యకుమార్ అనే కానిస్టేబుల్ పై చెట్టు విరిగి పడడంతో మృతి చెందాడు.

సోమవారం రాత్రి నుంచి కుండపోత వానలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటపొలాల్లోకి భారీగా వరద నీళ్లు చేరుకుంటుండంతో పంటలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఎపి ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది.సముద్రంలోకి చాపల వేటకు వెళ్ల వద్దని జాలర్లను ఆదేశించారు అధికారులు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News