Saturday, May 17, 2025

ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అజిత్

- Advertisement -
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Hero Ajith) గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అజిత్‌కి సినిమాలు (Movies) మాత్రమే కాదు.. రేసింగ్ (Racing) అంటే కూడా ఎంతో ఇష్టం. ఛాన్స్ దొరికినప్పుడల్లా రేసింగ్‌కి వెళ్తుంటారు అజిత్. ఈ క్రమంలో ఆయన పలు మాత్రం పెను ప్రమాదాలకు కూడా గురయ్యారు. అయినా కూడా ఆయన రేసింగ్‌ని వదల లేదు. కానీ, ఇప్పుడు ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

సినిమాలతో పాటు రేసింగ్‌కి కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన అజిత్ (Hero Ajith) .. ఒక పనితో బిజీగా ఉన్నప్పుడు మరోదాని జోలికి వెళ్లను అని స్పష్టం చేశారు. రేసింగ్‌లో పాల్గొనాలంటే చాలా ఫిట్‌గా ఉండాలని చెప్పిన అజిత్ సినిమాలు చేస్తూ డైట్ చేయడం చాలా కష్టమని అన్నారు. కార్ రేసులపై (Racing) దృష్టి పెట్టినప్పుడు శారీరకంగా బలంగా ఉండాలి. అందుకే సైక్లింగ్, స్విమ్మంగ్‌తో పాటు చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతా అని తెలిపారు. ఈ క్రమంలో ఎనిమిది నెలల్లో 42 కిలోలు తగ్గానని చెప్పారు. దీంతో మళ్లీ సినిమాలు (Movies) చేస్తే దానికి న్యాయం చేయలేను అందుకే రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉంటా అని అజిత్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News