Sunday, October 6, 2024

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు ఉధృతం.. 140 రాకెట్లతో ప్రతీకార చర్య

- Advertisement -
- Advertisement -

లెబనాన్ , చుట్టుపక్కల ప్రాంతాలలో యుద్ధ మేఘాలు దట్టం అయ్యాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యల ప్రతినతో హెజ్‌బొల్లా దలాలు శుక్రవారం ఇజ్రాయెల్ ఉత్తరప్రాంతంపై రాకెటు దాడులకు దిగాయి. 140 రాకెట్లను ప్రయోగించాయి. హెజ్‌బొల్లా బలగాలకు చెందిన వారి పేజర్లు, వాకీటాకీలను అదును చూసి సాంకేతిక ప్రక్రియతో పేల్చి వేసిన ఇజ్రాయెల్ సేనలపై తగు ప్రతీకారం ఉంటుందని ఈ మిలిటెంట్ల దళం నేత నస్రల్లా గురువారం రాత్రి తమ సందేశంలో తెలిపారు. మరో వైపు ఇక తాము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గురువారం రాత్రి లెబనాన్‌లో లోతట్టు ప్రాంతాలపై యుద్ధ విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. ఇందుకు ప్రతిగా ఇప్పుడు హెజ్‌బొల్లా పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఇజ్రాయెల్ సామూహిక రీతిలో తమపై జరుపుతున్న దాడులలో పౌర సముదాయ నివాసిత ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతోందని, దీనిని సహించేది లేదని హెజ్‌బొల్లా తెలిపింది.

ఇప్పుడు హెజ్‌బొల్లా నుంచి తమ భూభాగంపైకి రాకెట్ల దాడులు జరిగిన విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా నిర్థారించింది. లెబనాన్‌తో ఉండే సరిహద్దుల్లో మూడంచెలుగా ఈ దాడి జరిగిందని వివరించారు. అయితే తాము ఇందుకు ప్రతిగా ఇక దక్షణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలను, నిర్మాణ వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రతిదాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. తాము ఇజ్రాయెల్ భూతలంపైకి కత్యుషా రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ స్పందిస్తూ గోలన్ హైట్స్ ప్రాంతాలలో 120 వరకూ క్షిపణుల దాడులు జరిగాయని నిర్థారించింది. వీటిలో కొన్నింటిని తాము దెబ్బతీసినట్లు తెలిపిన ఇజ్రాయెల్ తమ ప్రాంతంలో ఏదైనా ప్రాణనష్టం , ఆస్తినష్టం జరిగిందీ ? లేనిది తెలియచేయలేదు. సదరన్ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు తరచూ గ్రామాలపై , ఇండ్లపై దాడులకు దిగుతున్నాయని, వీటిని తాము చూస్తూ ఊరుకునేది లేదని హెజ్‌బొల్లా స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News