Sunday, October 6, 2024

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

- Advertisement -
- Advertisement -

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చిన్నమడంపల్లి పంచాయితీ, కొత్తూరు తండా గ్రామానికి చెందిన ధారావత్ హతీరాం (40) వ్యవసాయ పనుల నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం తన చేనుకు వెళ్లి, విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడికి భార్య నాగమణి, కుమార్తె దీక్ష, కుమారుడు భవ్యన్ ఉన్నారు. కాగా, హతీరాం మృతి పట్ల గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. హతీరాం వ్యవసాయ భూమికి సమీపంలోని ఒక రైతు కోతుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి మృతి చెందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News