Tuesday, December 10, 2024

నిద్రపోతున్నారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజినింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ ఫాయిజనింగ్ జరిగి విద్యార్థులు ఆస్పత్రి పాలైతే అధికారులు నిద్రపోతున్నారా? అని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యా జ్యం పై బుధవారం హైకోర్టు లో జరిగిన విచారణ సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సిబ్బంది నిర్లక్షం, అపరిశుభ్రత వల్ల ఆహారం వికటించి పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అ రాధే ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది ని దర్శ నం కాదా? అని నిలదీశారు. విద్యార్థులు అస్వస్థతకు కారణమైన ఆహార పదార్థం షాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదిక వ చ్చాక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాగనూరు పాఠశాలలో వా రం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిం చడానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం వికటించిన ఘటనలపై పిటిషనర్ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ నిర్వహించింది. మాగనూరు జడ్పీ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని న్యాయవాది కోర్టుకు వివరించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థుల కు వడ్డించకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రనడానికి ఇంతకంటే నిదర్శనం ఎముంటుందని? ఈ ఘటనలను ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పర్యవేక్షించే అధికారులకు కూడా పిల ్లలున్నారు కదా అని, కాస్త మానవత్వంతో వ్యవహరించండని హితవు పలికింది. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించగా, అందుకు వారం రోజుల సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడం పట్ల హైకోర్టు మండిపడింది.

జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకు? అని ప్రశ్నిం చింది. సదరు అధి కారి వద్ద ఫోన్ లేదా ఇంటర్‌నెట్ సౌకర్యం లేదా లేకపోతే సదరు అధికారి మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో ఉన్నారా? అని లేదా అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందా? అని హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని, వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. చిన్నారుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా అని ప్రశ్నించింది. పిల్లలు చని పోతే కానీ స్పందించరా? అని హైకోర్టు మండిపడింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ విచారణ మధ్యలో హాజరై ఘటనకు సంబం ధించి పూర్తి వివరాలు సేకరించి భోజన విరామం తర్వాత సమర్పిస్తామని హైకోర్టుకు వెల్లడించారు. భోజన విరామం తర్వాత ఎఎజి తన వాదనలను వినిపిస్తూ, అస్వస్థతకు గురైన విద్యార్థులు బయటి నుంచి చిరుతిళ్లు (కురు కూరే) తిన్నారని కోర్టుకు వెల్లడించారు. కడుపునొప్పితో బాధపడిన చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తిస్థాయి నివేదికను సోమవారం సమర్పిస్తామని ఎఎజి కోర్టుకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News