Sunday, April 28, 2024

ఇంటి అనుమతి దరఖాస్తులు.. ఇ సేవల్లోనే.!

- Advertisement -
- Advertisement -

Home

 మున్సిపాలిటీల పరిశీలనకు అధికార బృందం
తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో దరఖాస్తులు
75 చ.గ.ల ఇంటి నిర్మాణ అనుమతి రుసుం రూ. 1
సెల్ఫ్ డిక్లరేషన్‌తో అనుమతులు

మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపాలిటీలందు ఇంటి నిర్మాణ అనుమతుల మంజూరులో పారదర్శకత ను పెంచేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు తెలంగా ణ పురపాలక విభాగం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు ఇంటి నిర్మాణ అనుమతల మంజూరుకు దరఖాస్తులను ఇ సేవల ద్వారా అందించే మార్గాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ ద్వారా దరఖాస్తుదారులకు, అధికారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని, పేదలకు తేలికగా ఇంటి నిర్మాణ అనుమతులు అందేలా చూడాలని మంత్రి కెటిఆర్ పురపాలక విభాగం ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది.

75 చ.గ.ల విస్తీర్ణంలోని ప్లాటులో ఇంటి నిర్మాణ అనుమతిని సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మంజూరు చేయాలని, అందుకు రుసుంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించాలని కొత్త మున్సిపల్ చట్టం స్పష్టంచేస్తున్న దరిమిలా ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకునే విధంగా సదుపాయాలను కల్పించాలని పురపాలక విభాగం భావిస్తున్నది. ఇంటి నిర్మాణ అనుమతు లు మంజూరులో జాప్యం లేకుండా, అవినీతికి తావులేకుండా చూడాలని, అందుకు ఏ మార్గాలు ప్రజలకు తేలికగానూ, సౌలభ్యంగానూ ఉండేలా చూడాలని మంత్రి కెటిఆర్ సూచించినట్టు అధికార వర్గాల వెల్లడిస్తున్నాయి.

మున్సిపాలిటీలకు ప్రత్యేక బృందాలు..

పురపాలక విభాగానికి చెందిన అధికారుల బృందం ఇటీవల రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు, సంస్థలకు చేరుకుని అక్కడ దరఖాస్తుల పరిష్కారానికి అనుసరిస్తున్న పద్దతులు, నెలకొన్న పరిస్థితులు, అనుమతుల మంజూరుకు సంబంధించిన పద్దతులు, సాంకేతిక వ్యవస్థ అమలు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇ సేవల ద్వారా దరఖాస్తులు అందించే విధానంను కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రజలు అనుకరిస్తరా.. లేదా..? అనేది పురపాలక సంఘాల్లోని ప్రజలను, అధికారుల బృందం అడిగి తెలుసుకున్నది.

ప్రస్తుతం దరఖాస్తులు పూర్తిగా ఆంగ్ల భాషలోనే ఉంటున్నాయని ఫలితంగా పట్టణాల్లో చాలా మంది గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని స్థానిక పౌరులు వివరిస్తున్నారు. ఇది గ్రహించిన పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రాంతీయ భాషలైన తెలుగు, హిందీ(ఉర్దూ), ఆంగ్ల భాషల్లో దరఖాస్తు పత్రాలను రూపొందించాలని ఆదేశించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. 75 చ.గ.ల వరకు ఉన్న ప్లాట్‌కు ఇంటి నిర్మాణ అనుమతులు కేవలం రూ. 1లు మాత్రమే చెల్లించాలి. అందుకు దరఖాస్తుదారుడు తమ దరఖాస్తులను ఇ సేవలోనే అందజేయాలి.

సెల్ఫ్ డిక్లరేషన్‌తో అనుమతులు..

రాష్ట్రంలో 141 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 128 పురపాలక సంఘాలు, 13 కార్పోరేషన్‌లు ఉన్నాయి. అయితే, వీటిల్లో ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకోవాలంటే ముందుగా ఇంటి ప్లాన్ వేసే ప్లానర్ దగ్గరకు వెళ్ళాలి. అతడిచ్చే ప్లాన్‌ను దస్తావేజుతో జతపరచి దరఖాస్తును పురపాలక సంఘాలు లేదా సంస్థల కార్యాలయాల్లో అందించాలి. అనంతరం ప్లానింగ్ అధికారులు వచ్చి ఇంటి నిర్మించే ప్లాటును పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. ఈ పద్దతిలో ప్లానర్లు, ఆర్కిటెక్చర్లు, ఇంజనీర్లు ఇటు దరఖాస్తుదారుల వద్ద, అటు అధికారులకు మధ్య దళారీ వ్యవస్థగా మారుతుందనేది మంత్రి అభిప్రాయం.

వీరు దరఖాస్తుదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలకు పుల్‌స్టాప్ పెట్టిలని మంత్రి కెటిఆర్ భావించారు. అనుమతులు మంజూరులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టం ప్రకారంగా 200 చ.గ.ల ప్లాటుకు అనుమతికి సంబంధించిన దరఖాస్తుదారుడు తన దరఖాస్తుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ జతపరిస్తే వెంటనే ఇంటి అనుమతిని మంజూరు చేస్తారు. ఫలితంగా నిర్మాణాన్ని చేపట్టవచ్చును. సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఏదేని పొరపాట్లు ఉంటే యజమానికి జరిమానాలను అధికారులు విధిస్తారు. ఫలితంగా ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం కనుమరుగై, అవినీతికి తావులేకుండా మంజూరు చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు.

Home permit applications are within e services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News