Friday, May 3, 2024

మేయర్లతో ఆర్థిక సంఘం ఛైర్మన్ భేటీ

- Advertisement -
- Advertisement -

RAJESHAM-GOUD

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలలో స్వయం సహాయ స్ఫుర్తిని, చొరవను పెంపొందించుటకు మేయర్లు ప్రయత్నించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మెన్ రాజేశం గౌడ్ అన్నారు. జీవన ప్రమాణాలు పెంపొందించాలన్నారు. ఆర్థిక సంఘం ఛైర్మెన్ రాజేశం గౌడ్ అధ్యక్షతన ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లతో బుధవారం హోటల్ ప్లాజాలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ స్థానిక సంస్థలను పురపాలక సంఘాలను బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసి కొత్త చట్టాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. వీటి కారణంగా సామాన్య మానవునికి కూడా ఎంతో లాభం కలుగుతుందని తెలిపారు. అందులో బాగంగానే జిల్లాలను, మండలాలను, గ్రామాలను, పురపాలికలను పునర్విభజించారన్నారు. ప్రజలకు సేవలందించాలని ప్రజా ప్రతినిధులను కోరినారు. ఈ సందర్భంగా మేయర్లు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యులు ఎం.చెన్నయ్య పాల్గొన్నారు.

Chairman of Economic Association meet with Mayors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News