Friday, June 9, 2023

హుక్కా పార్లర్ నిర్వాహకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హుక్కా పార్లర్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులు, 13మంది కస్టమర్లను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి హుక్కాకు సబంధించిన వస్తువులు, రూ.8,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొగల్‌పురాకు చెందిన ఎండి సుల్తాన్, షేక్ ఇజాజ్, షేక్ సాజిద్ కలిసి హుక్కా పార్లర్‌ను నిర్వహిస్తున్నారు. హుక్కా సెంటర్ యజమానిన ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు.

ఎలాంటి అనుమతి లేకుండా దుబాయ్ షీశా లాంజ్ పేరుతో హుక్కా పార్లర్‌ను నిర్వహిస్తున్నాడు. హుక్కా సెంటర్‌లోకి మైనర్ బాలురను అనుమతించి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా హుక్కా పాట్‌లను సరఫరా చేస్తున్నారు. హుక్కాలో నార్కోటిక్‌కు సంబంధించిన వాటిని కలపి కస్టమర్లకు ఇస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్సైలు నవీన్ కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News