Wednesday, May 8, 2024

ఉగాది రాశిఫలాలు.. ఆ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కదు

- Advertisement -
- Advertisement -

మేషం – దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు.

వృషభం – కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు.

మిథునం – నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కర్కాటకం – నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

సింహం – క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కదు.

కన్య – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

తుల – మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు.

వృశ్చికం – ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మకరం –  బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

కుంభం –  బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సోదరుల కలయిక.

మీనం – కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News