Tuesday, April 23, 2024

గచ్చిబౌలిలో హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హాస్టల్ నిర్వాహకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఎపికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గచ్చిబౌలిలో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఉదయం గదిలోకి వెళ్లిన దుర్గాప్రసాద్ చాలా సమయం అయినా కూడా బయటికి రాలేదు. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి చూసేసరికి ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News