Sunday, April 28, 2024

వ్యవసాయాన్నికార్పోరేట్లకు కట్టబెట్డడమే కేంద్రం లక్ష్యం: హన్నన్ మెల్లా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో రైతు ఆధారిత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ విధానం అని జాతీయ రైతుసంఘాల నేత హన్నన్ మెల్లా అన్నారు. మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుందని , కాని ఆ చట్టాల సారం మాత్రం బడ్జెట్‌లో యథావిధిగా ఉందన్నారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో 83 శాతం వ్యక్తిగత ఆధారిత పథకాల కోసమే కేటాయించారని తెలిపారు. రైతుల్లో 40శాతం కౌలు రైతులే ఉన్నారని, వారు ఈ వ్యక్తిగత లాభాలను పొందలేరన్నారు. వ్యవసాయం మీద అయ్యే ఖర్చులో 82 శాతం రైతులే భరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం తాము వ్యవసాయాన్ని రక్షిస్తున్నామని చెబుతున్నదన్నారు. వ్యవసాయంలో కార్పోరేట్ పెట్టుబడి 3శాతం మత్రామే అని తెలిపారు.

కొద్దిపాటి మొత్తం పెట్టుబడితో కార్పోరేట్ రంగం సాగును ,ఉత్పత్తిని , రవాణాను ,ప్రాసెసింగ్‌ను ,ఎగుమతులు దిగుమతులను, మార్కెటింగ్ సరఫరాను అదపు చేయాలనుకుంటున్నదన్నారు. వ్యవసాయ విధానం రైతు కేంద్రంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ రైతు ఎక్కడో అల్లంత దూరంలో ఉన్నాడన్నారు. 2014-2022 మధ్యలో లక్షమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎన్‌సిఆర్బి ఇచ్చిన నివేదిక వెల్లడించిందన్నారు. 23పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తే ధరలు పెరుగుతాయనేది కుతర్కం అన్నారు. పాయాయిల్ దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని , మన దేశంలో కూడా రైతులు పామాయిల్ ఉత్పత్తి చేయగలరన్నారు. చెరకు సంతతలో ధరలు లాభదాయకంగా లేవన్నారు. వ్యవసాయసంక్షోభాన్ని పరిష్కరించే సమగ్ర విధానం , ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని హన్నన్ మొల్లా ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News