Friday, September 13, 2024

20 ఏళ్ల క్రితం కట్టిన భవనం ఇప్పుడు ఎలా కూలుస్తారు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్ కూల్చివేయొద్దని ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధులు ఏంటని హైకోర్టు ఎఎజిని ప్రశ్నించింది. హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేశామని కోర్టుకు ఎఎజి తెలిపారు. ప్రదీప్‌రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేకపోవడంతో పాటు జన్వాడలో ఉన్న ఫాంహౌస్ జిఒ 111లోకి వస్తుందని, జిఒ 111 పరిధిలోని భూములు, కట్టడాలను నీటిపారుదల శాఖ పరిశీలిస్తుందని ఎఎజి కోర్టుకు వివరించారు. హైడ్రా కూల్చివేతలపై కూడా ఉన్నత న్యాయం స్థానం ప్రశ్నించింది. స్థల యజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితోనే నిర్మాణాలు జరుగుతాయని, 15-20 ఏళ్ల తరువాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణమంటూ కూల్చివేయడమేంటని న్యాయస్థానం అడిగింది. కూల్చివేతల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలియజేసింది. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News