Saturday, September 21, 2024

రాత్రికి రాత్రే సీన్ ఛేంజ్… వైఎస్ఆర్ఎస్ క్యాంపాఫీసుగా మారిన దువ్వాడ ఇల్లు !

- Advertisement -
- Advertisement -

టెక్కలి: ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కథ రోజుకో టర్నింగ్ తీసుకుంటోంది. నిన్నటి దాకా ఆయన ఇల్లు అనుకున్నది నేడు వైఎస్ఆర్ ఎస్ క్యాంప్ ఆఫీసుగా మారిపోయింది. దువ్వాడ భార్య వాణి ఆరుబయట కారు షెడ్ లో ధర్నా చేస్తున్నారు. దోమలు కుట్టకుండా దోమ తెర కట్టించుకున్నారు. దువ్వాడ ఇంట్లో ఎంత మంది ఉన్నారన్నది తెలియడం లేదు.

దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి కథ గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఎండ్ కార్డు పడ్డంలేదు. పరాయి ఆడదాని కోసం ఓ ఎంఎల్ సి ఇంతలా స్వంత భార్యను, కన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన ఘటన ఇదేనేమో. పైగా ఒకరిపై మరొకరు ఆక్రోశంతో నిందలేసుకుంటున్నారు.

గత రెండు వారాలుగా తనను, కుమార్తెలను ఇంట్లోకి అనుమతించడంలేదంటూ దువ్వాడ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నారు. దువ్వాడ, వాణి, మాధురి మధ్య ఇంటి పంచాయితీ ఎంతకీ తెగకపోగా ఇది రకరకాల మలుపులు తిరుగుతోంది. తన డబ్బుతోనే దువ్వాడ స్థలం కొని ఇల్లు కట్టారని వాణి ఆరోపిస్తుంటే, ఆ ఇల్లు తప్ప ఇంకేదైనా అడగాలంటున్నారు దువ్వాడ. ఇక ఇంటి నిర్మాణం కోసం దువ్వాడ తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ చెక్కులు చూపిస్తూ హల్చల్‌ చేస్తోంది మాధురి. ఇక తన దగ్గర స్థలం కొన్న దువ్వాడ ఇంకా రూ. 60 లక్షలు ఇవ్వాల్సి ఉందంటూ, ఆ బకాయి  కోసం పార్వతీశం అనే వ్యక్తి కూడా గోల పెడుతున్నారు. ఇప్పుడు ఇదో పెద్ద పంచాయతీగా తయారయింది.  దువ్వాడ, వాణిలకు పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఏ క్షణాన ఎవరికి ఏమి జరుగుతుందో తెలియడం లేదు. చట్టం లొసుగులతో వారంతా చెలగాటం ఆడుతున్నారనిపిస్తోంది. భారత దేశంలో అసలు కుటుంబ వ్యవస్థకు చట్టంలో ఎలాంటి చోటు, రక్షణ ఉందన్నది న్యాయ నిపుణులే తెలపాలి. తండ్రికి దూరమై, తల్లి వ్యధకు తల్లడిల్లుతున్న పిల్లలకు ఊరట ఏమిటి? కుటుంబంలో మూడో వ్యక్తి దూరితే పరిష్కారం ఏమిటో న్యాయ నిపుణులే స్పష్టం చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News