Saturday, July 27, 2024

అదానీ సంపద లోగుట్టు తెలియాలి: రాహుల్

- Advertisement -
- Advertisement -

how did Adani's wealth rise Asked rahul gandhi

నిలదీసిన రాహుల్

న్యూఢిల్లీ: దేశంలో అంతా ఆర్థికంగా గింజుకుంటుంటే వ్యాపారవేత్త అదానీ సంపద ఎట్లా పెరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కొవిడ్ 19 కారణంగా దేశంలో ప్రతి ఒక్కరి పరిస్థితి తలకిందులు అయింది. అయితే పేరుగాంచిన బిజినెస్‌మెన్ గౌతమ్ అదానీ ఈ కాలంలోనే తన సంపదను 50 శాతం మేర పెంచుకున్నారని, ఇది ఏ విధంగా సాధ్యం అయిందని ప్రశ్నించారు. 2021లో అదానీ నికర సంపద ఆస్తులు ఇతరత్రా కలిపితే 50 బిలియన్ల డాలర్లకు చేరుకుందనే రిపోర్టును రాహుల్ ప్రస్తావించారు.

ప్రపంచంలో ఎవరికి లేనంత సంపద ఆయనకు ఏ విధంగా సాధ్యం అయిందని విస్మయం వ్యక్తం చేశారు. 2020లో అదానీ సంపదలో పెరుగుదల లేదని, అయితే ఉన్నట్లుండి ఇప్పుడు 50 శాతం పెరిగి రూ 12 లక్షల కోట్లకు పడగలెత్తడం వెనుక లోగుట్టు ఏమిటని రాహుల్ నిలదీశారు. ఇటీవలి కాలంలో గణనీయంగా ఆదాయం పెంచుకున్న వారి వివరాలు ఓ నివేదికలో వెల్లడయ్యాయి. అమేజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, టెస్లా సిఇఒ ఎలన్ మస్క్‌ను తలదన్నుతూ అదానీ ముందుకు వచ్చారు. సంబంధిత వార్తను జతచేస్తూ రాహుల్ ఘాటుట్వీటు వెలువడింది.

how did Adani’s wealth rise Asked rahul gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News