Saturday, September 21, 2024

వాయు అధ్యయన రాకెట్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

ISRO Launches Sounding Rocket RH-560

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం రోహిణి శ్రేణి సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు అధికారికంగా ప్రకటించింది. వాతావరణంలోని తటస్థ వాయువులు, ప్లాస్మా పరిణామాలపై ఈ పరిశోధనల రాకెట్ అధ్యయనం చేస్తుంది. ఎల్ నినో, తుపాన్లు వంటి పరిస్థితుల విషయంలో ఈ న్యూట్రల్ విండ్స్ ఎటువంటి ప్రభావం చూపుతాయనేది ఈ రాకెట్ ద్వారా విశ్లేషిస్తారు. ఇక ఈ పరిధిలోని సాంద్రత ఇతరఅంశాలను ఆరాతీయడం జరుగుతుంది. రోహిణి పేరిట రాకెట్ల శ్రేణిని ఇస్రో రూపొందించింది. ఇప్పుడు ఈ వరుసలో సౌడింగ్ రాకెట్ (ఆర్‌హెచ్ 560)ని ప్రయోగించారు. దీని సాయంతో వివిధ ఎత్తులలో తటస్థ వాయువులలోని హెచ్చుతగ్గులను కనుగొనడానికి వీలేర్పడుతుందని ఇస్రో ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ISRO Launches Sounding Rocket RH-560

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News