Saturday, April 27, 2024

ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరిన్ని రైళ్లు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

More Trains will be available from April 01

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరిన్ని రైళ్లను నడపడానికి కేంద్ర రైల్వే శాఖ అనుమతిచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలు రైళ్లను నడపడానికి దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. రైలునెంబర్ 07207 విజయవాడ నుంచి సాయినగర్ షిర్డీకి వెళుతోంది. ఈ రైలు దారిలో మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్ స్టేషన్‌లలో ఆగుతుంది. రైలునెంబర్ 07208 సాయినగర్ షిర్డీ నుంచి విజయవాడ వెళుతోంది. ఈ రైలు దారిలో వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్, శంకర్‌పల్లి,లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర స్టేషన్‌లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02799 విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు

రైలు నెంబర్ 02799 విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతోంది. ఈ రైలు దారిలో మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 02800 సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది. ఈ రైలు దారిలో కాజీపేట జంక్షన్, వరంగల్, కేసముత్రం, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర స్టేషన్‌లలో ఆగుతుంది. రైలు నెంబర్ 02739 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతోంది. ఈ రైలు దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, అనకాపల్లి, దువ్వాడలో ఆగుతుంది. రైలు నెంబర్ 02740 సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.

ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్ స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07239 గుంటూరు నుంచి విశాఖపట్నం వెళుతోంది. ఈ రైలు దారిలో పెదకాకాని, నంబూరు, మంగళగిరి, విజయవాడ జంక్షన్, నూజివీడు, పవర్‌పేట్, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, గోదావరి, రాజమండ్రి, ద్వారపూడి, ఆనపర్తి, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్డు, ఎలమంచలి, అనకాపల్లి, దువ్వాడలో ఆగునుంది. రైలు నెంబర్ 02743 గూడురు నుంచి విజయవాడకు, రైలునెంబర్ 02664 విజయవాడ నుంచి గూడూరుకు వెళుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News