Sunday, October 6, 2024

ఫిలిప్పీన్స్ లో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ కు చెందిన వైద్య విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

ఫిలిప్పీన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వైద్యవిద్యార్థి అక్షయ్ మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న అక్షయ్ వాహనాన్ని మరో వాహనం రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడంతో అక్షయ్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబిబిఎస్ డిగ్రీ చదువుతున్నాడు. మరో 6 నెలల్లో డిగ్రీ పూర్తి చేసి ఎంబిబిఎస్ పట్టాతో భారత్‌కు తిరిగి రాబోతున్నాడు. ఇంతలోనే అక్షయ్ ఇలా ఆకస్మికంగా మరణించడంతో తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News