Wednesday, October 9, 2024

సినిమాకే హైలెట్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్‌…

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ‘ఎన్‌కెఆర్21’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం టీమ్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తోంది, ఇది 15 రోజుల పాటు కొనసాగుతుంది.

150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు షూట్‌లో పాల్గొంటున్న ఈ యాక్షన్ బ్లాక్‌ను ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో పీటర్ హెయిన్ మాస్టర్ సూచనలు ఇస్తూ కనిపించారు. ఈ చిత్రంలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News