Tuesday, October 15, 2024

20 న కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలో ఈ నెల 20 న సాయంత్రం 4 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన న ష్టంపై చర్చ జరుగనుండగా, అదేవిధంగా కేం ద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ని ధుల కేటాయింపుతో పాటు రాష్ట్రంలో వరద న ష్టం, జిల్లాల వారీగా ఎన్ని నిధులు ఇవ్వాలన్న అంశంతో పాటు ధరణి స్థానంలో కొత్తగా తీ సుకొచ్చిన భూమాత పోర్టల్‌పై కేబినెట్ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలు స్తోంది. మూసీ ప్రక్షాళన వేగవంతంపై చేపట్టా ల్సిన చర్యలు, స్థానిక

సంస్థల ఎన్నికలు, కులగణనపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పుపై మంత్రి మండలి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు చేయాల్సిన కసరత్తుతో పాటు రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ‘హైడ్రా’కు చట్టబద్ధత, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండి పరిధిలో బిల్డింగ్ అనుమతులు, ఎన్‌ఓసి జారీలో హైడ్రాను భాగస్వామి చేయడం వంటి విషయాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. రైతు రుణమాఫీ, రైతుభరోసా పథకం అమలు విధి, విధానాలు, కొత్త రేషన్ కార్డులపై కేబినెట్‌లో చర్చించనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 100 కొత్త పంచాయతీలు ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News