Thursday, March 28, 2024

4న తిరుమలో దీపావళీ ఆస్థానం..

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 28,311 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి 12,835 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది.తిరుమలో ఈనెల 4న దీపావళీ ఆస్థానం నిర్వహించనున్నట్లు టిటిడి తెలిపింది. దీంతో వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా వెంట తీసుకురావాలని టిటిడి అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.

Huge devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News