Wednesday, April 24, 2024

టెట్‌కు భారీగా పెరిగిన ఫీజు

- Advertisement -
- Advertisement -

ఒక్కో పేపర్‌కు రూ. వెయ్యి

రెండు పేపర్లకు రూ.2 వేలు

గతంలో పేపర్‌కు రూ. 200

సర్వీస్ టీచర్లకూ టెట్ అవకాశం

మే 20 నుంచి 15 రోజుల పాటు పరీక్ష

జూన్ 12న ఫలితాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమగ్ర నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షకు కావల్సిన అర్హతలు, పరీక్ష విధానాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈసారి టెట్ పరీక్ష ఫీజును భారీగా పెంచారు. గతంలో ఒక్కో పేపర్‌కు రూ. 200, రెండు పేప ర్లు రాస్తే రూ. 300 ఫీజు ఉండేది. 2023లో జరిగిన టెట్‌కు ఎన్ని పేపర్లు రాసిన రూ. 300 ఫీజు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా ఈ ఫీజును ఒక్క పేపరుకు రూ. వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలకు పెంచారు.

సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ టెట్‌కు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ళటెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ 11 జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. బి.ఇడ్, డి.ఇడి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. మే 15వ తేదీన హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకూ పరీక్ష ఉంటుంది. టెట్ ఫలితాల ను జూన్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాలలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News