Monday, April 29, 2024

శనివారం రాశి ఫలాలు(23-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – అనుకోని అవకాశాలు లబిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం –  ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం – వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు.

సింహం – మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య – వృత్తి వ్యాపార పరంగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి.

తుల – బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

వృశ్చికం – భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ధనున్సు – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కుంభం – పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.

మీనం –  సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు  అవసరం. ధన, వస్తు లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News