Friday, March 29, 2024

‘క్యూ’లో అంతర్జాతీయ కంపెనీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌కు భారీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. సిఎం కెసిఆర్ కృషికి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలకు పెట్టుబడుల ప్రవాహమే నిదర్శనం. తాజాగా అమెరికాకు చెందిన రెండు సుప్రసిద్ధ కంపెనీలు ఫెడెక్స్, బో యింగ్‌లు తమ పెట్టుబడులకు హైదరాబాద్‌ని ఎంచుకోవడంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అని ట్యాగ్ కూడా జత చే శారు. ఫెడెక్స్ అనేది అమెరికాకు చెందిన సరు కు రవాణా సంస్థ కాగా, బోయింగ్ అనేది వి మానయాన సంస్థ. దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబులిటీ కమ్యూనిటీ సెంటర్ (ఎసిసి) ను హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎసిసి అం దుబాటులోకి రానుంది. ఈ సెంటర్‌తో భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు మరింత వేగవం తం కాగలదని ఫెడెక్స్ పేర్కొంది.

ప్రధానంగా వ్యాపార వర్గాలకు వేగవంతంగా సరుకు రవాణా చేసేందుకు అవసరమైన ఇన్నోవేషన్, టెక్నాలజీ పరంగా ఎసిసి సెంటర్ కీలకమవనుంది. అంతేకాదు వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఎసిసి సెంటర్లను నెలకొల్పాలని ఫెడెక్స్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. జిఎంఆర్ ఏరో టెక్నిక్స్ భాగస్వామ్యంతో ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ హైదరాబాద్‌లో ప్రయాణికుల విమానాలను సరుకు రవాణాలుగా మార్చే కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో 737 బోయింగ్ ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్పిడి చేస్తారు. ఇందుకోసం కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నేడో, రేపో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఇప్పటికే విమాన యాన రంగంలో హైదరాబాద్ శరవేగంతో దూసుకుపోతోంది. ఇప్పటికే విమాన విడిభాగాలు, హెలికాప్టర్ బాడీ తయారీ వంటి వాటికి ప్రసిద్ధిగాంచిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News