Wednesday, September 18, 2024

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ వారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ తాకనున్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. ఈ ఎండాకాలం నిజంగా మండే కాలం కానున్నది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ తాకనున్నది. ఆ జిల్లాల్లో ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన అకాల వానలు కాస్త ఊరటనైతే కల్పించాయి. కానీ ఇప్పుడు నగర వాసులు మండుటెండలు కూడా చూస్తున్నారు. వాతావరణ శాక మార్చి 31 వరకు హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను తాకనున్నది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండగలదని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(టిఎస్‌డిపిఎస్) సూచించింది. కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నదని తెలిపింది. నగరవాసులు తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఐఎండి, టిఎస్‌డిపిఎస్ సూచించాయి.పెరుగన్నం తినడం శాస్త్రీయంగా మంచిదని, దానివల్ల యాసిడిటీని తగ్గించి కడుపును చల్లగా ఉంచుతుందని నిపుణులు తెలిపారు. వీలయినంత వరకు ఆహారంలో మసాలలు, ఉప్పు, చక్కెర వంటివి తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. వాటర్ రిచ్ ఫుడ్స్…దోసకాయ, టొమాటో సాలడ్, రసాల పండ్లు అంటే పుచ్చకాయ, నారింజ, కివి వంటివి తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News