Friday, April 26, 2024

డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్టు చేసిన పోలీసులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముంబై నుంచి హైదరాబాద్‌కు గాంజా, మరిజునా, ఎండిఎంఎ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ పెడ్లర్స్ నుంచి 204 గ్రాముల మెథలెనీడయాక్సీమెథాంఫెటమైన్(ఎండిఎంఎ), 110 గ్రాముల మరిజునా, కొన్ని సెల్ ఫోన్లను, నగదు, కార్లను పట్టుకున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ డ్రగ్ వాడకందారుని ట్రాక్ చేసి రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు ఎలా సరఫరా అవుతున్నాయో పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తమ పరిశోధనలో కొండాపూర్ నివాసి సనా ఖాన్‌ను గుర్తించారు. ఆమె ఓ ఐటి ఉద్యోగి. ఆమె మాదకద్రవ్యాలను సేవిస్తుండడమేకాక, హైదరాబాద్‌లో వాటిని విక్రయిస్తోందని కూడా గుర్తించారు. ఆమెపై నిఘా పెట్టి పోలీసులు నెట్‌వర్క్ గుట్టు రాబట్టారు. ఈ వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ సివి. ఆనంద్ తెలిపారు.

‘గత రెండు మూడేళ్లుగా ఆమె తరచూ ముంబైకి వెళ్లివస్తోంది. ముంబైలో జథిన్ బాలచంద్ర బాలేరావు నుంచి డ్రగ్స్ కొంటోంది. ఆమె ఒక గ్రాము ఎండిఎంఎను మూడు వేల రూపాయలకు కొంటుంది. తర్వాత దానిని హైదరాబాద్‌లో ఏడు వేల రూపాయాలకు అమ్ముతుంటుంది’ అని ఆనంద్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పోలీసులు తమ దర్యాప్తులో సనా ఖాన్‌కు హైదరాబాద్‌లో నలభైయాభై మంది, ముంబైలో 70 మంది వినియోగదారులున్నట్లు గుర్తించారు. పోలీస్ కమిషనర్ ఆనంద్ కథనం ప్రకారం జథిన్ నైజీరియాకు చెందిన ఎమాన్యూల్ ఓసోండు నుంచి కొకైన్ ను సేకరించేవాడు. ఎమ్మాన్యూల్‌ను ఇదివరలో బాహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.

హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌ఎన్‌ఈడబ్లు), గోపాలపురం పోలీసు అధికారులు 204 గ్రాముల ఎండిఎంఎ, నాలుగు స్మార్ట్‌ఫోన్లు, టొయోటా కొరొల్లా కారు, ఇతరములను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటి విలువ రూ. 20 లక్షలు ఉండొచ్చు. డ్రగ్ రాకెట్ గురించి సమాచారం అందడంతో దానిని ముంబై పోలీసులతో షేర్ చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. “మేము రెండు నెలలుగా పరిశోధన కొనసాగించాం, మూడు మాడ్యుల్స్‌ను పట్టుకున్నాం. ఇది చాలా అల్పమైనదే. అయితే మా పరిశోధనలో హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల లభ్యత గురించి కీలకమైన సమాచారాన్ని తెలుసుకున్నాం. ముంబై నుంచి నగరానికి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయి. హైదరాబాద్‌లోకి, తెలంగాణ లోకి మాదకద్రవ్యాలు రవాణా కాకుండా మేము ముంబై పోలీసులతో కలిసి కార్యకలాపాలు నిర్వహించనున్నాం’ అని పోలీస్ కమిషనర్ ఆనంద్ తెలిపారు.

గాంజా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి ముంబైకి రవాణా అవుతోంది. హైదరాబాద్ పోలీసులు ఓ ఇన్నోవా వాహనాన్ని పట్టుకుని .. 110 కిలోల గాంజా, రూ. 1.5 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు .. అన్ని కలిపి రూ. 36 లక్షల విలువ చేసే సామాగ్రిని పట్టుకున్నారు. ముంబైలోని బిల్కిస్ సులేమాన్ షేఖ్, ఆమె భర్త అలీ అస్ఘర్ జహీరాబాద్‌లోని ముర్తుజా షేఖ్‌ను కాంటాక్ట్ చేసి అరకులోయలో గాంజాను పెంచే శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ దంపతులు 110 కిలోల ఎండు గాంజాను శ్రీనివాస్ నుంచి కొనడానికి మరికొందరిని పంపారు. వారు హైదరాబాద్ చేరగానే ముర్తుజా షేఖ్ ఆర్‌టిసి బస్సులో 20 కిలోల గాంజాను జహీరాబాద్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సమాచారం అందగానే ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్‌లతో కలిసి ముర్తుజాను ఎంజిబిఎస్‌లో పట్టుకున్నారు. పట్టుకున్న మూడు ముఠాలు ముంబైతో కనెక్షన్ ఉన్నవేనని కమిషనర్ తెలిపారు.

డిసిపి జి. చక్రవర్తి ‘హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ గురించి మాట్లాడుతూ ‘104 మాదకద్రవ్య సంబంధిత కేసులు నమోదయ్యాయి. 212 పెడ్లర్స్‌ను పట్టుకున్నాము. మొత్తంగా రూ. 6.03 కోట్లు విలువచేసే 12 రకాల మాదకద్రవ్యాలను పట్టుకున్నాము, 1076 వినియోగదారులను పోలీసులు పట్టుకున్నారు’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News