Thursday, February 2, 2023

హైదరాబాద్ పోలీసుల దాడులు…అదుపులోకి రౌడీషీటర్లు

- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు శనివారం వేకువ జామున గంగానగర్ ప్రాంతంలో దాడులు జరిపి అనేక మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలు, నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. “గంగానగర్‌లో అర్ధరాత్రి 2.00 గంటలకు మేము కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టాము. సరైన పత్రాలు లేని 78 ద్విచక్రవాహనాలు, రెండు త్రిచక్రవాహనాలు, తొమ్మిది మొబైల్ ఫోన్లను, రూ. 20వేల నగదును స్వాధీనం చేసుకున్నాం” అని సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య విలేకరులకు శనివారం తెలిపారు. “స్మశాన ప్రాంతంలో తిరుగుతున్న 14 మంది రౌడీ షీటర్లను, 17 మంది అనుమానిత వ్యక్తులను, పేకాట ఆడుతున్న 10 మందిని కస్టడీలోకి తీసుకున్నాం” అని కూడా ఆయన తెలిపారు.

Police raid

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles