Wednesday, October 9, 2024

చెరవీడిన చెరువు

- Advertisement -
- Advertisement -

మూడు చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం
దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా
ఉద్రిక్తతల మధ్య మాదాపూర్, అమీన్‌పూర్, దుండిగల్ పరిధిలో భారీ భవంతులు, డూప్లెక్స్
విల్లాలు, అక్రమ లే అవుట్లు కూల్చివేత
జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు
గచ్చిబౌలిలోనూ ఆక్రమణదారులకు తాఖీదులు

మనతెలంగాణ/అమీన్ పూర్: హైడ్రా మరింత దూకుడు పెంచింది. ఆదివారం మూడు ప్రాంతాల్లో భారీబందోబ స్తు మధ్య కూల్చివేతలను జరిపింది. హైదరాబాద్ నగర శివార్లలోని అమీన్‌పూర్ పెద్ద చెరువు, దుండిగల్ మల్లంపేట్ లోని కత్వా, మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ సందర్భంగా మాదాపూర్ సున్నం చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. కూల్చివేతలను అడ్డుకునే క్ర మంలో ఐదుగురు వ్యక్తులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు.

పోలీసులు అ డ్డుకుని, అక్కడి నుంచి వారిని తరలించి ఆక్రమణలను కూల్చివేశారు. దీంతో కూల్చివేతలు నిరంతరాయంగా సాగాయి. అయితే, సున్నం చెరువు ప్రాంతంలో ఒడిశాకు చెందిన కూలీలు వేసుకున్న గుడిసెలను కూడా తొలగించారు. గుడిసె వాసులు కొందరు ఆగ్రహానికిలోనై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. ఆదివారం ఉ. 5.30 గం.ల ప్రాంతంలోనే కూల్చివేతల ప్రాంతాలకు చెరుకున్న దాదాపు 30 టీంలు, అత్యాధునిక హైడ్రాలిక్ క్రేన్‌లతో భారీ పోలీసు బందోభస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు.

ఐదు అంతస్థుల భవనం నేలమట్టం
మాదాపూర్ లోని సున్నం చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మిస్తున్నటువంటి నాలుగు అంతస్తులది ఒకటి, రెండు అంతస్తులది మరొకటి భవనాలను కూల్చివేసి, 30కిపైగా షెడ్ లను అధికారులు నేటమట్టం చేశారు. 10 ఎకరాల చెరువు భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకున్నది. అమీన్‌పూర్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్‌కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారు.

దుండిగల్ మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్ .టి.ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి 11 డూప్లెక్స్ విల్లాలను అధికారులు తొలగించి 2 ఎకరాల చెరువు భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్నది. పలువురు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా హైడ్రా ఎవరి అభ్యంతరాలను పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేతలను కొనసాగించింది. మల్లంపేట్ చెరువు వద్ద విల్లాల్లోని ఇంటి సామాగ్రిని బయటపెట్టగా.. కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించి.. ఇండ్లలోని వస్తువులను మరల ఇంటిలోపిలికే తరలించారు. నివాసమున్న ఇండ్లను కూల్చివేయమని చెప్పడం అధికారులు వెల్లడించారు.

అక్రమ నిర్మాణాల్లో మాజీ ఎమ్మెల్యే
సున్నం చెరువు, పెద్ద చెరువు, మల్లంపేట కత్వా ప్రాంతాల్లోని కూల్చివేసివి నిర్మాణ దశలోనే ఉన్నాయి. మల్లంపేట్ కత్వా వద్ద విలాలను నిర్మించిన శ్రీలక్ష్మీ నివాస్ సంస్థ చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన నిర్మాణాలు ప్రధానంగా కాంపౌండ్ గోడలు, గదులు, షెడ్‌ల రూపంలోని ఆక్రమణలే ఉన్నాయి. ఏపీకి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడికి చెందిన నిర్మాణాలుగా హైడ్రా అధికారులు గుర్తించారు. సున్నం చెరువు ఎఫ్‌టిఎల్‌లో నిర్మించిన కొన్ని షెడ్లు నిర్మించి హోటల్‌ను వాణిజ్యపరంగా వినియోగిస్తున్నందున కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. సున్నం చెరువు ప్రాంతాల్లో గోపాల్ అనే వ్యక్తిఅక్రమ నిర్మాణాలు చేపట్టారనీ, అమీన్ పూర్‌లో విజయలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపల్ రెడ్డిలు కలిసి నిర్మాణాలను ,చేపట్టిన్టుట అధికార వర్గాలు వెల్లడించాయి.

నేనే కూల్చివేస్తా : మురళీమోహన్
జయభేరి కన్‌స్ట్రక్షన్ సంస్థ గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువును ఆక్రమించుకున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ రంగనాథ్ ఆ చెరువును పరిశీలించారు. అనంతరం ఎఫ్‌టిఎల్ పరిధిలోకి కొంత మేర మెష్ వచ్చినట్టు నిర్మాణ సంస్థకు తెలియజేసి దానిని తొలగించాలని సూచించారు. అనంతరం మెష్‌ను తొలగించేందుకు వారం రోజులు గడువునిచ్చింది హైడ్రా. దీంతో మురళీమోహన్ స్పందిస్తూ.. తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టంచేశారు. ‘ నేను ఆక్రమణలకు పాల్పడలేదు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను.

ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. బఫర్ జోన్‌లో ఉంటే నేనే కూల్చేస్తాను. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా ఆధికారులు వచ్చారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేరకు.. రేకుల షెడ్డు ఉన్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆ రేకుల షెడ్డును మేమే తొలగించేస్తాం.. హైడ్రా రానక్కర్లేదు. రెండ్రోజుల్లో (మంగళవారం లోపు) తాత్కాలిక షెడ్డును తొలగిస్తాం’ అని మురళీ మోహన్ స్పష్టం చేశారు. దీంతో మురళీ మోహన్‌పై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News