Tuesday, October 15, 2024

నివాసిత భవనాల జోలికి వెళ్లం: రంగనాథ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించి నివాసముంటున్న భవనాల జోలికి వెళ్లమని, కేవలం నిర్మాణ దశలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేవారు. ఆదివారం చోటుచేసుకున్న కూల్చివేతలపై వస్తున్న విమర్శలకు ఆయన స్పందించారు. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సం బంధించి కొన్ని వివరణలను కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించబడి, వ్యక్తులు ఆక్రమించిన ఇల్లు లేదా కు టుంబం నివాసమున్న కట్టడాలను ఏదీ కూల్చివేయబడదని తెలిపారు. ఎఫ్‌టిఎల్ లేదా బఫర్‌లోకి వచ్చే కొత్త నిర్మాణాలను కూల్చివేయబడతాయని తెలిపారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోనలలో ఫ్లా ట్లు, ఖాళీ స్థలాలుగానీ, భవనాలు గానీ, భూములుగానీ కొనుగోలు చేయరాదని కమిషనర్ సూ చించారు.

వ్యక్తిగత ఇండ్లు అలాగే స్థలాలు కొనుగోలు చేసే ముందు అవి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా? లేదా? అని ముందుగా ప్ర జలు నిర్ధారించుకొవాలని హైడ్రా కమిషనర్ ప్ర జలకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ని చెరువులకు సంబంధించిన ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ల వివరాలను తెలుసుకునేందుకు హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లోని లేక్ ప్రొటెక్షన్ కమిటీలో తెలుసుకోవచ్చని, లేదా హైడ్రా కార్యాలయానికి వచ్చి వివరాలను తెలుసుకోవడం, సందేహాలను నివృ త్తి చేసుకోవచ్చని, ఏదేని కొనుగోలు చేసుకునేముందు పూర్తి వివరాలను తెలుసుకున్న అనంతరమే కొనుగోలు చేయాలా? వద్దా? అనేది నిర్ధారించుకుని భవనం, ప్లాటు, ఫ్లాట్స్ కొనుగోలు చేయాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు.

విద్యాసంస్థల సంగతేంటి?

చెరువుల్లో వెలిసిన నిర్మాణదశలో ఉన్న ఆక్రమణలను మాత్రమే కూల్చివేస్తున్నామన్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటన సర్వ త్రా ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పలు చెరువుల్లో కొందరు ప్రజాప్రతినిధులకు చెందిన విద్యాసంస్థల భవనాలు ఉన్నాయనేది తెలిసిందే. అయితే, వాటిలో గత కొన్నేళ్లుగా విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ ఆక్రమణలను కూల్చివేయాలని హైడ్రాకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అం దాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ దశలో ఉన్నవాటినే కూల్చేస్తామని ప్రకటించడంతో వాటికి వెసులుబాటు కల్పించినట్టుగా విమర్శలు వ స్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News