Saturday, April 13, 2024

బిజీగా ఉన్నా…విచారణకు రాలేను

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్‌సి కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంఎల్‌సి కవిత సిబిఐకి లేఖ రాశారు. కవితకు సిబిఐ గతంలోనే నోటీసులు ఇవ్వగా, అందులో ఆమెను సాక్షిగా పేర్కొన్నారు. ఇ ప్పుడామె పేరును నిందితుల జాబితాలో చేర్చినందున నోటీసులకు సవరణ చేస్తూ ఆమెను నిందితురాలిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కవిత సీబీఐకి లేఖ రాశారు. నోటీసుల్లో పేర్కొన్నట్టు ఈ నెల 26న తాను విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. 2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులకు ఇప్పడు సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్య త్యాసం ఉందని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితు ల్లో నోటీసులు ఇచ్చారన్నదానిపై స్పష్టత లేదని కవిత అన్నారు. అంతేకాదు, మరి కొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సమయంలో నోటీసులు ఇవ్వడం అనే ప్రశ్నలు రేకెత్తిస్తోందని తన లేఖలో పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ తరఫున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఢిల్లీ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే, 41ఎ నోటీసులను రద్దయినా చేయండి, లేదా వెనక్కి అయినా తీసుకోండి అని కవిత విజ్ఞప్తి చే శారు. ఒకవేళ సిబిఐ తన నుంచి ఏవైనా ప్రశ్నల కు సమాధానాలు కోరుకుంటే వర్చువల్ పద్దతి లో హాజరయ్యేందుకు తాను అందుబాటులో ఉం టానని స్పష్టం చేశారు. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో హామీ సిబిఐకి కూడా కూడా వర్తిస్తుందని గతంలోనూ సిబిఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని వెల్లడించారు.

నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరు రాలిగా సిబిఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తా నన్నారు. కానీ, 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిం దని.. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేప థ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News