Tuesday, April 16, 2024

రేపిస్ట్‌కు భార్యగా ఉండలేను

- Advertisement -
- Advertisement -

nirbhaya convict

 

ఔరంగాబాద్ : నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతాదేవి విడాకులు కోరుతూ మంగళవారం ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రేపిస్ట్ భార్య అనే ముద్రతో తను బతకదలుచుకోలేదని, విడాకులు ఇప్పించమని సెంట్రల్ బీహార్ నబీనగర్ బ్లాక్‌కు చెందిన అక్షయ్ ఠాకూర్ భార్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారంనాడు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లైంగికపరమైన కేసులో భర్త నేరస్థుడిగా తేలితే భార్య విడాకులు కోరవచ్చని చట్టం చెబుతోందని ఆమె తరఫు న్యాయవాది ముకేష్ సింగ్ కోర్టుకు తెలిపారు. తన భర్త నిర్దోషి అని, కావాలని దోషిగా ముద్ర వేశారని ఠాకూర్ భార్య ఇటీవల చెప్పారు. ఇలా ఉండగా, మార్చి 20న అమలు కావలసిన నిర్భయ దోషుల ఉరిశిక్షను ఆపడానికి ఇది మరో పథకం అని పుకార్లు వ్యాపించాయి.

I cannot be wife of rape person
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News