- Advertisement -
రంగారెడ్డి: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. జ్యూస్ తాగుతుండగా యువకుడు(32) కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. యువకులలో గుండె జబ్బులు పెరగడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుక్త వయసులో గుండె జబ్బులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి.. ఎందుకు? ఏమిటి? ఎలా?
60% ప్రజలు మన భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడుతున్నారని, అత్యధికంగా కార్బోహైడ్రేట్ ఆహారం మన భారతీయ ఆహారంలో ఒక భాగంగా ఉండడం ఒక కారణమైతే శారీరక శ్రమ తగ్గడం, క్రమబద్ధమైన నడక వ్యాయామం లేక జీవనశైలి లేకపోవడం అనేది గుండె జబ్బులకు ప్రధాన కారణం అనిపిస్తోంది. అంతేకాకుండా విపరీతమైన ఒత్తిడి వలన బిపి పెరగడం అనేది చాలా సాధారణ అయిపోయింది. దానికి తోడు ఈ ధూమపానం మద్యపానం అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనిమీద కంట్రోల్ చేసే వ్యవస్థ అనేది మనకు లేదు.
- Advertisement -