Saturday, August 9, 2025

కొత్త ఖాతాదారులకు ఐసిఐసిఐ షాక్

- Advertisement -
- Advertisement -

ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ షాకింగ్ వార్త చెప్పింది. బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ విషయంలో నూతన నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో, అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్‌లకు మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి ఏకంగా రూ.50,000కి పెంచింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త ఖాతాలకు వర్తిస్తుందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతోపాటు సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో కూడా మినిమం బ్యాలెన్స్ పెంచుతున్నట్లు చెప్పిన బ్యాంకు వర్గాలు… సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటే, ఇప్పుడు అది రూ.25,000కి పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్‌లలో రూ.2,500 నుంచి రూ.10,000కి పెంచారు.

మినిమం బ్యాలెన్స్‌తో పాటు, బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్‌లపై కూడా కొత్త ఛార్జీలు విధించింది. ఇప్పుడు ఒక నెలలో మూడు ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్‌ల తర్వాత, అదనపు ట్రాన్సాక్షన్‌లకు (డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్) రూ.150 వసూలు చేస్తారు. అంటే, బ్రాంచ్‌లో లేదా ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రా చేస్తే, మూడు ట్రాన్సాక్షన్‌లు ఫ్రీ, ఆ తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. సెలవు దినాల్లో ఏటీఎం ద్వారా క్యాష్ డిపాజిట్ చేస్తే, నెలలో టోటల్ ట్రాన్సాక్షన్ రూ.10,000 దాటితే, ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.50 వసూలు చేస్తారు. ఆగస్టు 1, 2025 తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినవాళ్లు ఈ కొత్త మినిమం బ్యాలెన్స్ రూల్స్‌ని తప్పక పాటించాల్సి ఉంటుది ఒకవేళ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే, పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News