Wednesday, October 9, 2024

నక్సల్స్ మందుపాతర పేలుడు.. పోలీసు బలి

- Advertisement -
- Advertisement -

బీజాపూర్ : చత్తీస్‌గఢ్‌లో ఆదివారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో చత్తీస్‌గఢ్ సాయుధ బలగాలు (సిఎఎఫ్)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఈ ఐఇడిని అమర్చి గురి చూసి పేల్చినట్లు వెల్లడైంది. నక్సల్స్ ప్రభావిత జిల్లాలో బెచపల్ పదంపర గ్రామం వద్ద మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సిఎఎఫ్ ఈ ప్రాంతంలో గాలింపులకు వస్తున్నాయని తెలియడంతో నక్సల్స్ ఈ మందుపాతరను అమర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ జాడ కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు. ఇక్కడ అమర్చి ఉన్న ఐఇడిపై హెడ్ కానిస్టేబుల్ చూసుకోకుండా కాలు వేయడంతో అది పేలిందని వెల్లడైంది. ఈ పోలీసు జవాను మృతదేహాన్ని వెంటనే మిర్టూర్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News