Sunday, April 28, 2024

కాంగ్రెస్ స్కామ్‌లకు అంతులేదు

- Advertisement -
- Advertisement -

దేశంలో టెలికం వ్యవస్థ నిర్మాణం అవసరం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 జి స్కామ్ జరిగింది. ఇక క్రీడోత్సవాల దశలో కామన్‌వెల్తు స్కామ్ దూసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి పనులను కాంగ్రెస్ పాలనలో కేవలం తమ స్వార్థానికి వాడుకున్నారని, దీనితో పనులు ముందుకు సాగలేదని ప్రధాని మోడీ విమర్శించారు. దేశ అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థల బలోపేతం అనివార్యం దశలో కాంగ్రెస్ పాలనలో హెలికాప్టర్లు, సబ్‌మెరైన్‌లు, యుద్ధ విమానాల స్కామ్‌లు జరిగాయని తెలిపారు.

దేశ ప్రజల ప్రతి అవసరంతో సయ్యాటలకు దిగడం కాంగ్రెస్‌కు పవర్‌తో అబ్బిన విద్య అయిందన్నారు. ఈ దేశం దోపిడికి గురి కాకుండా చూస్తానని తాను అధికారంలోకి రాగానే హామీ ఇచ్చానని, ఈ దిశలోనే సాగుతున్నానని వివరించారు. దీవి ప్రాంతపు ద్వారకకు భూతల ఒకాకు మార్గ అనుసంధానం తేలిక చేసే తీగల వంతెన ఇప్పుడు ముందుకు వచ్చిందని వివరించారు. ఇక్కడ వెలిసిన సుదర్శన సేతు కేవలం రాకపోకల వంతెన కాకుండా అత్యద్భుత ఇంజనీరింగ్ నిర్మాణ పని. ఇప్పుడు ఇది వెలియడంతో ప్రయాణికులు , ఇక్కడికి వచ్చే విశేష కృష్ణ భక్తులు ఇకపై పడవలపై ద్వారకానాథుడిని చూసేందుకు వెళ్లే రోజులు గతించాయి.

ఇక ఈ వంతెన ద్వారా తమ మజిలీ చేరుకోవచ్చునని ఈ వంతెన విశేషాలను ప్రధాని ప్రస్తావించారు. తాను గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ప్రజల సౌకర్యార్ధం ఇక్కడ ఇటువంటి వంతెన అవసరాన్ని పలు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చానని , కానీ వారు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు తన హయాంలో పని ఆరంభం అయ్యి, వంతెన ప్రజలకు అందుబాటులోకి రావడం తన పరమ అదృష్టంగా భావిస్తున్నానని మోడీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News