Friday, May 3, 2024

ఒక్కసారి దర్శిస్తే మళ్లీ సందర్శించాలనే ఆతృత పెరగాలి

- Advertisement -
- Advertisement -

అలంపూర్ : అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠం తెలంగాణలో ఏకైక శక్తిపీఠం తెలంగాణలో ఏకైక శఖ్తిపీఠం అలంపూర్ జోగులా ంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దేశంలో నే ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. బుధవారం అలంపూర్ జోగులాంబ బాల బ్ర హ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యే క పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ చైర్మ న్ కృష్ణయ్య ప్రధాన అర్చకులు పూర్ణకుంభం , మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంత రం శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ ఆలయాలలో పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

అనంతరం ప్రసాద్ స్కీం కింద రూ. 37 కో ట్లతో నిర్మిస్తున్న నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. మొదటి అంతస్తు రెండవ అంతస్తులు ఏ యే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ సందర్భ ంగా మంత్రి సంబంధించిన మ్యాపును పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసే వసతులు గురించి తెలుసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అలంపూర్ దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. దేవాలయానికి వచ్చేదారులతో ఆర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతంలో అందమైన మొక్కలు నాటాలన్నారు.

ప్రసాద్ స్కీం ద్వారా నిర్మిస్తున్న నిర్మాణ త్వరగా పూర్తి అయితే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. దేవాలయ ఆర్చి మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసి ఆలయ వివరాలు పొందుపర్చాలన్నారు. ఒకసారి దర్శిస్తే మళ్లీ మళ్లీ సందర్శించాలనే ఆత్రుత పెరగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద చూపుతూ ధూప దీప నైవేద్య పథకం ద్వారా ప్రతి దేవాలయం పూజలు అందుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆలయ చైర్మన్ కృష్ణయ్య, మున్సిపల్ చైర్మన్ మనోరమ, ఆర్డీఓ రాములు, టూరిజం శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News