Tuesday, October 15, 2024

చేనేత కార్మికులను రుణ విముక్తులను చేస్తాం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చేనేత అభయహస్తం లోగో ఆవిష్కరించారు. నేతన్నకు చేయూత పథకం కింద రూ.290 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు సిఎం రేవంత్ చెప్పారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. దాదాపు రూ.30 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసి.. చేనేత కార్మికులను రుణ విముక్తులను చేస్తామన్నారు. “రైతన్న ఎంత ముఖ్యమో.. మాకు నేతన్న కూడా అంతే ముఖ్యం. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటా. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదు.. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ.. IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించాం” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News