Wednesday, March 22, 2023

ఇల్లందులో మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం….

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మునిసిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఒంటెద్దు పోకోడలు పోతున్నారని, మహిళా కౌన్సిలర్ల పట్ల నిర్లక్ష్యం వహించిడంతో పాటు హేళనగా చులకనగా మాట్లాడుతున్నాడని మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం మెమొరండం ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు వచ్చారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఉన్నారని దరఖాస్తు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతూ….
జిల్లా కలెక్టర్ మహిళా కౌన్సిలర్ల పట్ల గౌరవం లేకుండా గంటసేపు నిలబెట్టారని, మా వద్ద ఉన్న అవిశ్వాస తీర్మానం మెమొరాండం కాగితాలను కలెక్టర్ పిఎ గుంజుకొని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ల మైన మా పట్ల జిల్లా కలెక్టర్ అవమానకరంగా ప్రవర్తించారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News