Wednesday, April 17, 2024

సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మధ్యాహ్నం భోజనం కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉంటుందని, ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ చేస్తామని వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఇహెచ్‌ఎస్ విధానం ప్రవేశ పెడుతామన్నారు. ఉద్యోగుల కోసం ఎంప్లాయూస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. మహేశ్వరం, మణుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభిస్తామని, జెఎన్‌టియు పరిధిలో త్వరలో మరో రెండు కొత్త ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

ప్రతి నియోజకవర్గంలో 1100 మంది దళిత బంధు ఇస్తామని, 118 నియోజకవర్గాలకు కలిపి రూ.12980 కోట్లు కేటాయిస్తామన్నారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని, నియోజకవర్గానికి రెండు వేల మందికి చొప్పున రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కోటాలో మరో 25 వేల మందికి ఆర్థిక సాయం చేస్తామని, మొత్తం 2.63 లక్షల మందికి రూ.7890 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని హరీష్ రావు చెప్పారు. అన్ని జిల్లాలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ విస్తరణ ఉంటుందని, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్‌కు రూ.200 కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు. కొత్తగా నాలుగు లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం ఉంటుందని, ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News