Saturday, April 20, 2024

పాక్ ప్రధాని షరీఫ్‌పై కేసు నమోదుకు సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిషన్లు

- Advertisement -
- Advertisement -

 

లాహోర్ : పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యకు ప్రధాని షెహనాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి , ఆర్మీ ఉన్నతాధికారి ఈ ముగ్గురూ కుట్ర పన్నారని ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈనెల 3 న ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగింది. సాయుధులైన ఇద్దరు కాల్పులకు పాల్పడ్డారు. ప్రధాని సెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగాఈ దాడి జరిగింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీద్ మొహమ్మద్ బషీర్‌ను నవంబర్ 8న పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఫిర్యాదు మేరకు ప్రధాని షరీఫ్, మంత్రి రానా సనౌల్లా, ఐఎస్‌ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ అధిపతి మేజర్‌జనరల్ ఫైసల్ నజీర్‌పై ఇంకా కేసు నమోదు కాలేదు. అయితే ఈ ముగ్గురే తనపై హత్యకు కుట్ర పన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్, క్వెట్టాల్లోని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కార్యాలయాల్లో పిటిషన్లు దాఖలు చేశామని పిటిఐ నేత షా మొహమ్మద్ ఖురేషీ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News