Thursday, April 18, 2024

రియల్ బూమ్

- Advertisement -
- Advertisement -

 house sales

 

2019లో హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు

రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో 150శాతం వృద్ధి, ఐటి ఒత్తిడితో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్

హైదరాబాద్ : హైదరాబాద్ రెసిడెన్సియల్ మార్కెట్ 2019 సంవత్సరానికి గాను 16,267 యూనిట్ల అమ్మకాలతో స్థిరంగా 4 శాతం వృద్ధితో ముందుకెళుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన అర్ధ-వార్షిక నివేదిక వెల్లడించింది. నైట్ ఫ్రాంక్ ఇండియా తన ప్రతిష్టాత్మక అర్ధ-వార్షిక నివేదికను,- ఇండియా రియల్ ఎస్టేట్ -12వ ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో జూలై- నుంచి డిసెంబర్ 2019 (H2 2019) కాలంలో రెసిడెన్సియల్ మరియు ఆఫీస్ మార్కెట్ పనితీరుకు సంబంధించిన ఒక సమగ్ర విశ్లేషణతో కూడిన ఎడిషన్‌ను నైట్ ఫ్రాంక్ మంగళవారం సమర్పించింది.

2019 సంవత్సరంలో హైదరాబాద్‌లో స్థిరంగా గృహ అమ్మకాలు ఉన్నాయని, రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ ప్రారంభాల్లో 150 వృద్ధిని సాధించిందని ఈ సంస్థ తెలిపింది. గతం కన్నా 2019 సంవత్సరం 10 శాతం అధిక సగటు ధర పెరుగుదల హైదరాబాద్‌లో కనిపించిందని నైట్‌ఫ్రాంక్ అర్ధవార్షిక నివేదికలో తెలిపింది. 2019 సంవత్సరం మొత్తం లావాదేవీలను చూసుకుంటే 1.2 మిలియన్ చదరపు- మీటర్లు (12.8 మీ.చ.అ)లతో ఆల్-టైమ్ రికార్డ్‌ను ఆఫీస్ స్పేస్ నమోదు చేసుకుందని కూడా నైట్‌ఫ్రాంక్ పేర్కొంది.

స్థిరంగా రెసిడెన్సియల్ యూనిట్ల కొనుగోలు
గతానికి భిన్నంగా 2019 సంవత్సరం హెచ్2లో ఆఫీస్ స్పేస్‌కు సంబంధించి 173 శాతం భారీ వృద్ధిని చవిచూసిందని ఐటి, ఐటిఈఎస్ (IT/ITeS) రంగంలో ఈ వృద్ధి అధికంగా నమోదయ్యిందని ఆ సంస్థ తెలిపింది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో గతానికి కన్నా భిన్నంగా 2019 సంవత్సరంలో 150 శాతం వృద్ధితో 13,495 యూనిట్లతో రెసిడెన్సియల్ యూనిట్లను స్థిరంగా కొనుగోలు చేయడం వల్లే ఈ వృద్ధి నమోదయ్యిందని ఆ సంస్థ పేర్కొంది.

హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు సంబంధించి ఆల్-టైమ్ అధిక వృద్ధితో 2019 లావాదేవీల్లో 1.2 మి.చ.మీ (12.8 మిలియన్ చదరపు అడుగులు) వృద్ధిగా నమోదయ్యిందని, గతంకన్నా 2019లో 82 శాతం చెప్పుకోదగ్గ వృద్ధి సాధించిందని ఆ సంస్థ తెలిపింది. ఇదే సంవత్సరం కొత్త ఆఫీస్ స్పేస్‌కు సంబంధించి 181శాతం భారీ వృద్ధితో 1 మి. చ.మీ (10.9 మి.చ.అ) పెరుగుదల నమోదయ్యిందని, H2, 2019 (జూలై- నుంచి డిసెంబర్) కాలంలో లీజింగ్ వ్యాల్యూమ్‌లలో బెంగళూరును సైతం హైదరాబాద్ అధిగమించడంతో మార్కెట్‌లో బలమైన కమర్షియల్ ట్రెండ్‌ను నగరం ప్రదర్శించిందని ఆ సంస్థ తెలిపింది.

హైదరాబాద్ రెసిడెన్సియల్ మార్కెట్ విశిష్టతలు
హైదరాబాద్‌లో రెసిడెన్సియల్ ప్రాజెక్ట్‌లు 2019లో 150శాతం వృద్ధితో 13,495 యూనిట్లకు చేరాయని, H2, 2019 ప్రారంభంలో ఆరు-సంవత్సరాల గరిష్టంతో చూసుకుంటే 8,065 యూనిట్లుగా నమోదయ్యిందని దీనివల్ల గతానికన్నా భిన్నంగా ఈసారి 375 శాతం భారీ వృద్ధి నమోదయ్యిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్ ఏరియాలు (పశ్చిమ హైదరాబాద్‌లో) H2, 2019లో అధిక సంఖ్యలో 5,176 యూని ట్లు ప్రారంభమయ్యిందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. రెసిడెన్సియల్ అమ్మకాల్లో హైదరాబాద్ H2, 2019లో 9 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసిందని, అలాగే, కమర్షియల్ సెగ్మెంట్ కార్యకలాపాల్లో 4శాతం వృద్ధి కనిపించిందని ఆ సంస్థ పేర్కొంది.

హైదరాబాద్ వృద్ధి భిన్నంగా…
నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థూర్ మాట్లాడుతూ హైదరాబాద్ రెసిడెన్సియల్ మార్కెట్ వృద్ధి ఇప్పుడు సరికొత్త స్థాయికి చేరిందన్నారు. డిమాండ్, సరఫరా, పెట్టుబడులు ఉరకలెత్తుతుండడంతో ఈ నగరానికి సంబంధించిన రెసిడెన్సియల్ మార్కెట్ పరుగులెడుతుందని, ఇది ఒక ఆకర్షణీయ విభాగంగా కొనసాగుతోందన్నారు. ఆఫీస్ మార్కెట్ రూపంలో దృఢమైన పనితీరు అండగా ఉండడంతో, హౌసింగ్ ప్రాజెక్టుల్లో హైదరాబాద్ ఇప్పుడు అద్భుత వృద్ధిని చవిచూస్తోందన్నారు.

ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, అమ్మకాల వేగం స్థిరంగానే ఉండడం ఆశ్చర్యకర పరిణామమని ఆయన పేర్కొన్నారు. సంస్థాగత రుణదాతలు, జాతీయ స్థాయి డెవలపర్ల నుంచి పెట్టుబడులు ఆకర్షించే సామర్థం ఉండడంతో ఈ మార్కెట్ ప్రాథమికంగా పటిష్టమైన పనితీరు కనబరుస్తోందన్నారు. భారతదేశపు హౌసింగ్ మార్కెట్ కథనంతో పోలిస్తే, హైదరాబాద్ వృద్ధి భిన్నంగా ఉంటోందని, ఐటి ఆఫీస్ వృద్ధి రూపంలో డిమాండ్, వలస వచ్చేవారిని ఆకర్శిస్తుందని, చౌకధరలో ప్రాపర్టీ మార్కెట్‌కు ఈ అంశాలన్నీ కలిసి వస్తున్నాయన్నారు.

ముంబై, గుర్గావ్, బెంగళూరు నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో…
ఆఫీస్ స్పేస్ విభాగంలో హైదరాబాద్ అద్భుత వృద్ధిని నమోదు చేసిందని, ముంబై, గుర్గావ్, బెంగళూరు నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో ఉందని డైరెక్టర్ శాంసన్ ఆర్థూర్ పేర్కొన్నారు. ప్రాథమికంగా టెక్నాలజీ, ఐటి కంపెనీల వృద్ధి ఎక్కువగా ఉందని, ఈ నేసథ్యంలో రానున్న రోజుల్లో ఇది స్థిరంగా ఉండే అవకాశం కనిపిస్తోందన్నారు. చాలావరకు కొత్త ప్రాజెక్టులను హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసరాల్లో ప్రారంభిస్తున్నారన్నారు. ఇదే రకమైన విధమైన వృద్ధి మైక్రో-మార్కెట్ల రూపంలో నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్‌లో కనిపిస్తుందన్నారు. ఇక్కడ పెద్ద మొత్తంలో భూములు అందుబాటులో ఉండడమే దీనికి కారణమని ఆయన తెలిపారు.

Increased house sales in Hyderabad in 2019
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News