Thursday, April 18, 2024

నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Municipal Election

 

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, దాఖలుకు గడువు 10
11న స్క్రూటినీ, 12న అప్పీళ్లు, ఉపసంహరణ 14

షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ విడుదల
10న నామినేషన్ల దాఖలుకు గడువు, 11న స్క్రూటినీ, 12న అప్పీల్, 14న ఉపసంహరణ
22వ తేదీన పోలింగ్.. 25న ఓట్ల లెక్కింపు
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లకు ఎన్నికలు
కరీంనగర్ కార్పొరేషన్‌లో ఓటర్ల జాబితా సరిచేస్తే అర్ధరాత్రే నోటిఫికేషన్ ఇస్తాం : ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి

హైదరాబాద్: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సంబంధిత మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు బుధవారం ఉదయం నోటీసులు జారీ చేస్తారని, ఆ వెంటనే ఉ॥ 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు. హైకోర్టు మున్సిపల్ ఎన్నికలపై ఉన్న పిటిషన్లను డిస్మిస్ చేయడంతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 22న ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, 09 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 10న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా ఉన్నట్లు చెప్పారు. 11న నామినేషన్ల (స్క్రూటిని) పరిశీలించనున్నట్లు తెలిపారు.

12న రిజెక్ట్ అయిన వాటికి జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. 14న మధ్యాహ్నాం 3గంటల వర కు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 22న ఉ॥ 7గంటల నుంచి సా॥ 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రీపోలింగ్ చేపట్టాల్సి వస్తే 24న నిర్వహిస్తారు. మున్సిపాలిటిల్లో అభ్యర్థి ఖ ర్చు రూ.లక్ష, కార్పొరేషన్‌లో అభ్యర్థి ఖర్చు రూ.లక్షా 50వేలు మించకుండా ఉండాలన్నారు. జిహెచ్‌ఎంసి డబీర్‌పుర వార్డు నెంబ ర్ 30 ఖాళీకి కూడా నోటిఫికేషన్ చేస్తున్నామన్నారు. జిహెచ్‌ఎంసి చట్టం ప్రకారం నామినేషన్ తిరస్కరణకు గురైతే అప్పీల్‌కు అవకాశం లేదన్నారు.

కరీంనగర్‌లో ఓటరు కమ్యూనిటీలలో కొన్ని డిస్ట్రబెన్స్ ఉన్నాయని హైకో ర్టు చెప్పిందని, వాటిని పరిష్కరించగలిగితే ఎన్నికలకు వెళ్లవచ్చునని పేర్కొందన్నారు. ముసాయిదాలో ఒకలా, తుది జాబితాలో మరోలా ఉండటం కోర్టు దృష్టికి వెళ్లిందన్నారు. కరీంనగర్ ఎన్నికల అధికారులతో మాట్లాడుతున్నామని, తప్పులు సరిచేసుకుంటే అర్ధరాత్రి వరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓటరు నమోదు, డిలిట్స్ ఆధారంగా అనుబంధ ఓటర్ల జాబితా తీసుకుంటామన్నారు.

నేడు ఎన్నికల నోటీసు విడుదల, ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.
ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.
11న నామినేషన్ల పరిశీలన.
12న తిరస్కరణ, నామినేషన్లకు అప్పీల్.
14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటన.
22న పోలింగ్ (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు).
25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్. వెంటనే ఫలితాల ప్రకటన.

Municipal Election Notification Released
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News