Wednesday, December 4, 2024

నాలుగో రోజు ఆట ప్రారంభం.. జడేజా ఔట్, సెంచరీ దిశగా కోహ్లీ..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా దీటైన జవాబిస్తోంది. 289/3తో ఆదివారం(నాలుగో రోజు) బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆట ఆరంభించిన కొద్దిసేపటికే రవీంద్ర జడేజా(28) ఔటయ్యాడు. దీంతో భారత్ 309 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

అనంతరం క్రీజులోకి వికెట్ కీపర్ కెఎస్ భరత్ తో కలిసి విరాట్ కోహ్లీ స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టిస్తున్నాడు.ప్రస్తుతం భారత్ 131 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(88), భరత్(25)లు ఉన్నారు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News