Sunday, October 6, 2024

చెలరేగుతున్న బంగ్లా బౌలర్లు.. రోహిత్, కోహ్లీ, గిల్ ఔట్

- Advertisement -
- Advertisement -

టీమిండియాకు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గురువారం ఉదయం చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.

స్వల్ప వ్యవధిలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(06), శుభ్ మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(06)లను పడగొట్టిన బంగ్లా.. టీమిండియాను దెబ్బకొట్టింది. దీంతో జట్టు స్కోరు 34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(16), రిషబ్ పంత్(03)లు ఉన్నారు. ఇక, 12 ఓవర్లు ముగిసేసరికి బారత్ మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News