Wednesday, October 9, 2024

గోవాలో జానీ మాస్టర్ ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ జానీ మాస్టర్ పై ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం మహిళను విచారించిన పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బాధితురాలు ఫిర్యాదు కేసు నమోదు చేయడంతో జానీ మాస్టర్ పరారయ్యాడు. అతని కోసం నాలుగు ప్రత్యేక బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగిన గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు, లధాక్ లలో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లిన పోలీసులకు దొరక్కుండా ఎస్కేప్ అయిన జానీ మాస్టర్.. చివరకు గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు హాజరుపర్చనున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News