Thursday, October 10, 2024

మోమినల్ సెంచరీ… బంగ్లాదేశ్ 205/6

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: గ్రీన్‌పార్క్‌లో భారత్ -బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ నాలుగో రోజు బంగ్లా జట్టు 66 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మోమినల్ హక్ సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో(31), షాద్మాన్ ఇస్లామ్(24), లిట్టన్ దాస్(13), ముష్ఫికర్ రహీమ్(11), షకీబ్ అల్ హసన్(09) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో మోమినల్ హక్(102), మెహిడీ హసన్ మిరాజ్(06) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, అకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు. రెండో టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News