Sunday, May 11, 2025

ఇకనుంచి ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పాకిస్థాన్ లేదా ఏ ఇతర దేశం, ఏ శక్తి నుంచి ఉగ్ర వాద దాడులు జరిగినా , హింసాత్మక చర్యలు తలెత్తినా వీటిని భారతదేశం యుద్ధ నేర చర్యగా పరిగణిస్తుంది. ఈ మేరకు ఇ టువంటి కవ్వింపు చర్యలను యుద్ధంలో మాదిరిగానే తిప్పికొడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం రాత్రి ఉన్న త స్థాయి సమావేశం జరిగింది. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్, సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాక్ చర్యలను ఈ సందర్భంగా కూలంకుషంగా సమీక్షించారని ఆ తరువాత అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి , ఆ తరువాత పాక్ నుంచి తలెత్తిన కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇక ఎటువంటి ఉగ్ర చర్యను అయినా యుద్ధంగానే పరిగణనలోకి తీసుకుని, వీటిని తిప్పికొట్టడం జరుగుతుందని ఈ మేరకు తగు విధంగా సరైన ఏర్పాట్లు చేసుకుని తీరాలని ఈ భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోని వివిధ నగరాలు, కీలక ఆయుధ స్థావరాలు, ప్రత్యేకించి పౌర సముదాయాలపై పాకిస్థాన్ నుంచి సాగిన దాడులను ఈ ఉన్నత స్థాయి సమీక్షలో తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ దేశంలో నెలకొని ఉన్న భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దుల్లో భద్రత, సరిహద్దు రాష్ట్రాలలో నెలకొన్న ఉద్రిక్తతల గురించి సమీక్షించారు. ఈ దశలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ , త్రివిధ సైనిక బలగాల అధిపతులు ప్రధానికి, రక్షణ మంత్రికి ఇప్పటి పరిస్థితిని తెలియచేశారని వెల్లడైంది.

యుద్ధ చర్య లేదా యాక్ట్ ఆఫ్ వార్ అంటే?
ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న యుద్ధ చర్య లేదా యాక్ట్ ఆఫ్ వార్‌కు విసృత నేపథ్యం ఉంది . ఏదైనా దేశం పలు కారణాలు లేదా అకారణంగా ఇతర దేశాలపై సాయుధ బలగాల ద్వారా దాడికి దిగడం లేదా అతిక్రమణ చర్యలకు పాల్పడటాన్ని ఈ యాక్ట్ ఆఫ్ వార్‌గా పిలుస్తారు. ఇటువంటి హింసాత్మక , సామూహిక రీతి నష్టం కల్గించే దాడులు సాయుధ ఘర్షణ లేదా యుద్ధంగా పరిగణిస్తారు. ఇందుకు అనుగుణంగానే ప్రత్యర్థి దేశంపై తగు చర్యకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఏ దేశం అయినా ఇతర దేశాల దుందుడుకు చర్యలలో యాక్ట్ ఆఫ్ వార్ మిళితం అయి ఉందని భావిస్తే , తగు రీతిలో దెబ్బకు దెబ్బను సైనిక చర్యను చేపట్టవచ్చు. పరస్పర ఘర్షణలతో కూడిన యుద్ధానికి తలపడవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఉగ్రవాద చర్యలు ఎటువంటివి జరిగినా వాటిని భారతదేశం ఈ యుద్ధ పరిధి నిర్వచనంలోకి చేర్చుకుని , ఎదురుదాడులు, అణచివేతలకు దిగేందుకు వీలుంటుంది. యాక్ట్ ఆఫ్ వార్ పరిధిలోకి వచ్చే ఎటువంటి చర్యను అయినా అంతర్జాతీయ చట్టాలు , ఐరాస నిర్ధేశిత నిబంధనల పరిధిలో తగు విధంగా తిప్పికొట్టేందుకు అవసరం అయిన న్యాయసమ్మత హక్కు సంబంధిత దేశానికి ఉంటుంది.

ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతకు భంగకరం అయ్యే ఎటువంటి సైనిక చర్య లేదా దాడిని అయినా చెల్లనేరనిదిగా ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనావళి సంబంధిత ఆర్టికల్ 2(4)లో నిర్ధేశించారు. భద్రతా మండలి రూపొందించిన చార్టర్ మేరకు ఏ దేశం అయినా తన ఆత్మరక్షణకు దాడికి దిగితే తప్పితే ఇతర సైనిక చర్య ఎటువంటిది అయినా , అది ఆయా దేశాల అవాంఛనీయ సంస్థలు లేదా సాయుధ బృందాల నుంచి జరిగే హింసాత్మక చర్య అయినా యుద్ధం పరిధిలోకి వస్తుంది. ఇటువంటి వాటిని బాధిత దేశం సరైన విధంగా న్యాయపరంగా తిప్పికొట్టేందుకు వీలేర్పడుతుంది. అయితే యాక్ట్ ఆఫ్ వార్ గురించి ఐరాస ఛార్టర్‌లో నిర్థిష్టంగా పూర్తి స్థాయి వివరణ లేదు. అయితే సైనిక చర్యలను తగు విధంగా తిప్పికొట్టే ఎటువంటి యాక్షన్‌ను అయినా ఐరాస సమర్థిస్తుందని తెలిపారు. ఈ పూర్వ నేపథ్యం దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఇప్పుడు యాక్ట్ ఆఫ్ వార్ పరిధిలోనే ఉగ్రవాద చర్యలను పరిగణనలోకి తీసుకుని, తగు విధంగా స్పందించాలని నిర్ణయించింది. యుఎన్ ఛార్టర్‌ను తగు రక్షణ కవచంగా అంతకు మించిన లక్ష్మణ రేఖ ఇకపై చర్యలకు దిగాలని సంకల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News