Sunday, April 28, 2024

భారత్ జిడిపి 7.6 శాతం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిస సంవత్సరం(2023-24) రెండో త్రైమాసికం(జూలై సెప్టెంబర్)లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఈమేరకు ఆర్‌బిఐ గణాంకాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిడిపి 7.8 శాతంగా ఉంది. గతేడాది రెండో త్రైమాసికంలో జిడిపి 6.2 శాతంగా ఉంది. అయితే రెండో త్రైమాసికంలో జిడిపి 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. అంటే రెండో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్‌బిఐ అంచనాల కంటే వేగంగా వృద్ధి చెందింది. డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జిడిపి రూ. 41.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో రూ. 38.17 లక్షల కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News