Wednesday, May 8, 2024

దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: భారత్ జోడో యాత్ర గత నెల 23న తెలంగాణలో ప్రవేశించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగకుండా యాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భరోసానిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. రేపు తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగియనుంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు మద్దతుగా వీడ్కోలు పలికేందుకు రేపు మేనూరులో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఎవరెలాంటి సమస్యలు సృష్టించినా తెలంగాణ ప్రజలు యాత్రను విజయవంతం చేశారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

ప్రపంచ చరిత్ర పుటల్లో దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం చేశారని,  గాంధీ స్ఫూర్తితో రాహుల్ పాదయాత్ర చేపట్టారన్నారు. ఇడి, సిబిఐ దాడులు చేసినా, రాహుల్ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా వెనకడుగు వేయడంలేదన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. జెండాలు, ఎ జెండాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలకు అతీతంగా యాత్రకు మద్దతు తెలపాలన్నారు. మోడీ పాలనలో దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందన్నారు. అందుకే ప్రజలంతా భారత్ జోడో యాత్రకు మద్దతుగా కదలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కదలి వచ్చి మెనూరులో సాయంత్రం 4 గంటలకు జరిగే కృతజ్ఞత సభ ను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సమాజహితం కోసం మీడియా మిత్రులు కూడా రాహుల్ పాదయాత్రలో కదం కదం కలపాలన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో దాడులకు పాల్పడుతున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News